సంతానలేమి ఒక లోపమా…?

IVF-Pregnancy-Problems

సంతానలేమి ఒక లోపమే!

పెళ్ళయిన తర్వా త ఒక సంవత్సరకాలం పాటు కలసికాపురం చేస్తున్నా పిల్లలు పుట్టలేదంటేవారిలో ఏదోఒక లోపం ఉన్నట్లుగా అనుమానించవలసివస్తుంది. పిల్లలు పుట్టకపోవడం శాపం కాదు, ఒక లోపం మాత్రమే! అందుకే- ఒక ఏడాది కాలంగా కలసికాపురం చేస్తున్నా పిల్లలు కలగని దంపతులు వెంటనేవైద్య నిపుణులను సంప్రదించి తమలో లోపాలేమైనా ఉన్నా యేమో తెలసుకోవాలి. పిల్లలు పుట్టకపోవడానికి భార్యా భర్తలు ఇద్దరిలోనూ లోపాలు ఉండవచ్చు . ఒకటికంటేఎక్కు వగా కూడా కారణాలు ఉం డవచ్చు . అందువల్లనేభార్యా భర్తలిద్దరికీఒక యూనిట్గా పరీక్షలు చేసితగిన కారణాలు గుర్తించి చికిత్సా విధానాన్నిఅమలుపరచవలసివుంటుంది.

పురుషులలో లోపాలు: –

వీర్యకణాల ఉత్పత్తిలోనూ, సారూప్యతలోనూ, సంఖ్యా పరంగానూ కదలికలలోనూ తేడాలు ఉండటం, బీజవాహికలో అడ్డంకులు ఏర్పడటం, సెమన్ క్వా ంటిటీలోనూ క్వా లిటీలో తేడాలు ఉండటాన్ని ప్రధానంగా చెప్పు కోవచ్చు . సాధారణంగా స్పెర్మ్ వాల్యూ మ్ 1 నుంచి 5 ఎం.ఎల్ ఉండాలి. స్పెర్మ్ కౌంట్ 20 మిలియన్ల మిల్లీ లీటర్లు ఉండాలి. అందులో అరవైశాతం కణాలు ముందుకు కదలవలసివుంటుంది. అలాగేఅరవైశాతం సారూప్యత కలిగిఉండాలి. మొదటిసారిపరీక్ష చేసినప్పు డు వీర్యకణాలలో తేడాలు ఉన్నట్లుగా గుర్తిస్తే- తదుపరిఆరువారాల తరువాత మళ్ళీ పరీక్షలు జరిపిఆ లోపాలనూ, లోపాల
తీవ్రతనూ నిర్ధారించుకోవలసివుంటుంది. సంతాన ఉత్పత్తిలో వీర్యకణాల కదలికలు ప్రధానపాత్రవహించినప్పటికీవీర్యకణాల సంఖ్య ఒక మిల్లీలీటర్ పరిమాణంలో పదిమిలియన్ల కణాలకన్నా తక్కు వ ఉన్నా లేదా మొత్తం కణాల సంఖ్య ముప్పయ్ మిలియన్ల కన్నా తక్కు వ ఉన్నా అలాగే 80శాతం సారూప్యతాలోపం ఉన్నా సాధారణ గర్భధారణ దాదాపు అసాధ్యమనేచెప్పా లి. అదేవిధంగా ఎఫ్.ఎస్.హెచ్, ఎల్.హెచ్, ప్రొ లాక్టిన్ హార్మో న్లలో తేడాలు ఉన్నట్లయితేవీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. వీర్యకణాల సంఖ్య బాగా తక్కు వ ఉన్నా , సారూప్యతలో ఎక్కు వ తేడాలున్నా క్రోమోజోములో తేడాలు వుంటాయి. ఇటువంటివారికిక్రోమోజోముల పరీక్షలు తప్పనిసరిగా చేసిపరిస్థితి తీవ్రతను గుర్తించవలసివుంటుంది. రక్తంలోగానీ, వీర్యంలోగానీ యాంటిస్పెర్మ్ , యాంటీబాడీస్ ఉన్నట్లయితేవీర్యకణాల కదలికలు బాగా తక్కు వగా ఉంటాయి. అలాగే వీర్యకణాల సంఖ్య, కదలికలు ఇన్ఫెక్షన్ల కారణంగా కూడా తగినంతగా ఉండకపోవచ్చు .కొంత మందిలో ఏ విధమైన కారణములేకుండానేవీర్యకణాల సంఖ్య, కదలికలలో తేడాలు ఉండటాన్ని కూడా గమనిస్తుంటాము. మరికొంత మందిలో వీర్యకణాలు పూర్తిగా లోపించినట్లయితే- బీజవాహికలో అడ్డంకులు ఏర్పడటం లేదా, వీర్యకణాల ఉత్పత్తి క్రమంలోనేఅవరోధం ఏర్పడటం కారణాలుగా అనుమానించవలసివుంటుంది. ఈ లోపాలకు కారణాలనూ, తీవ్రతనూ నిర్ధారించేందుకు టెస్టుక్యు లార్ బయాప్సీ పరీక్ష చేయవలసివుంటుంది. ఈ బయాప్సీ పరీక్షలో వీర్యకణాల ఉన్నట్లుగా గుర్తించినట్లయితేబీజవాహికలో అడ్డంకులు ఉన్నట్లుగా నిర్ధారిస్తారు. అలాగేవీర్యకణాల ఉత్పత్తి క్రమంలో ఉండేఅవరోధాలను ఈ పరీక్ష ద్వా రా గుర్తించవచ్చు . 

స్త్రీలలో ఉండేలోపాలు :

వెజైనల్, సర్వైకల్ ఇన్ఫెక్షన్లు, సర్వైకల్ మ్యూ కస్ వీర్యకణాల ప్రయాణానికిఅనుకూలంగా లేకపోవడం, గర్భసంచిలో తేడాలు ఫైబ్రాయిడ్స్ ఉండటం, నిర్మా ణంలో లోపాలు, గర్భసంచి కుహరంలో అతుకులు ఏర్పడటం. అండం ఉత్పత్తిలో తేడాలు : – అండం విడుదల కాకపోవడం, లూటియల్ ఫేజ్ డిఫెక్ట్స్ , ఫెలోఫియన్ ట్యూ బులో తేడాలు వుండటం, అబార్షన్ తరువాత, డెలివరీతరువాత, సుఖవ్యా ధుల వలన పెల్వి క్ ఇన్ఫెక్షన్లు ఆశించిట్యూ బులు మూసుకుపోవడం, పెల్వి క్ టీబీ రావడం, ఎండోమెట్రియోసిస్ వ్యా ధికలగటం. ఇమ్యూ లాజికల్ ప్రాబ్లమ్స్ : రక్తంలోనూ యోని గర్భసంచి ముఖద్వా రం నుంచి స్రవించేద్రవాలలో స్పెర్మియాంటీబాడీస్ ఉ౦డటం. ఎండోక్రైన్స్లో తేడాలు : డయాబెటీస్, థైరాయిడ్, ప్రొ లాక్టిన్ హార్మో న్లలో తేడాలు ఉండటం.
ఇతర లోపాలు : పౌష్టికాహార లోపాలు, సైకోజెనిక్ ఇన్ఫెర్టిలిటీఏ కారణం లేకుండా కలిగేసంతానలేమి. (Un Expleined – అన్ ఎక్స్ప్లె యిన్డ్) కారణాలు – విశ్లేషణ : 55 శాతం దంపతులలో పురుషులలో లోపాలు ఉండగా, స్త్రీలలో ఎటువంటిలోపమూ ఉండకపోవచ్చు . ఫెలోపియన్ ట్యూ బుల్లో తేడాలు 30 శాతం వరకూ ఉండవచ్చు . అండం ఉత్పత్తి క్రమంలో తేడాలు 24 శాతం వరకు వుంటుంది. ఎండోమెంట్రియోసిస్ 4 నుంచి 5 శాతం ఉంటుంది. క్రోమోజోమ్స్ తేడాలు 1.2 శాతం ఉండవచ్చు .పెల్వి క్ టీబీ 0.7 శాతం కారణమౌతుంది. 

సమగ్రపరీక్షలు – పరిశీలనలు :

పిల్లలు పుట్టకపోవడానికిగల కారణాలను సమగ్రంగా పరిశీలించి, పరీక్షించి, వివిధ కోణాలలో అధ్యయనం చేసి నిర్ధారించుకున్న మీదటేఆయా లోపాలను బట్టిచికిత్సా విధానాలను అమలు చేయాల్సి వుంటుంది. పిల్లలు లేని దంపతులందరికీటెస్ట్యూ బ్ బేబీ విధానం (IVF) అవసరపడకపోవచ్చు . ఎందుకంటే-వారిలోని చిన్న చిన్న లోపాలు కొద్దిపాటిజాగ్రత్తలతో మందులతో నయం కావచ్చు . ప్రతి పదిమందిదంపతులలో ఒకరికి మాత్రమే ఐవిఎఫ్, ఇక్సీ వంటిఆధునిక చికిత్సలు అవసరపడుతుంటాయి. సంతానలేమికిగల కారణాలు తెలుసుకోవడానికిఅవసరాన్ని బట్టిఆల్ట్రాసౌండ్, లాపరోస్కో పీ, హిస్టరోస్కో పీ, కంప్లీట్ సెమన్ ఎనాలసిస్ వంటిపరీక్షలు చేయవలసివస్తుంది. అలాగేహార్మో న్ టెస్ట్ కూడా జరపవలసివస్తుంది.

డా॥ కొల్లి రమాదేవి, MD, DNB, DGO, (MRCOG)
సంబంధిత వ్యా ధుల నిపుణులు, ఫోన్ : 92464-17882